ఒమన్‌లో పాక్షిక ఆంక్షలు..వాహనదారులకు అలెర్ట్..!!
- October 24, 2026
మస్కట్: ఒమన్‌లోని దోఫార్ గవర్నరేట్‌లో సలాలా–తఖా–మిర్బాత్ రహదారిపై పాక్షికంగా ట్రాఫిక్ ఆంక్షలు విధించనున్నట్లు రాయల్ ఒమన్ పోలీస్ (ROP) ప్రకటించింది. ఐరన్‌మ్యాన్ వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో భాగంగా నిర్వహించనున్న ఐరన్‌మ్యాన్ 70.3 సైక్లింగ్ పోటీ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాయల్ ఒమన్ పోలీస్ సంబంధాలు, భద్రతా సమాచార విభాగం వెల్లడించింది.
ఈ మేరకు అక్టోబర్ 24 ఉదయం సలాలా–తఖా–మిర్బాత్ మార్గంలో పాక్షిక రహదారి మూసివేత ఆంక్షలు అమల్లో ఉంటాయని తెలిపింది. పోటీ నిర్వహణ సజావుగా సాగేందుకు ఈ చర్యలు చేపడుతున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ మార్గంలో ప్రయాణించే వాహనదారులు ట్రాఫిక్ ఆంక్షలను గమనించి, పోలీసుల సూచనలను పాటించాలని సూచించారు.
తాజా వార్తలు
- కువైట్‌లో అమీరీ దివాన్ హార్స్ వేలం..!!
- యూఏఈలో బాలికను ఒంటరిగా వదిలేసిన మహిళ.. కోర్టు కీలక తీర్పు..!!
- యూఏఈలో ఈ-ఇన్వాయిసింగ్ అమలుకు గడువు.. నెలకు Dh5,000 జరిమానా!
- బెర్న్‌లో బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్న మంత్రి జూపల్లి కృష్ణారావు
- ఖతార్‌లో దోమల నివారణకు మార్గదర్శకాలు జారీ..!!
- అరబ్ రీడింగ్ ఛాలెంజ్..అక్టోబర్ 29న దుబాయ్‌లో తుది వేడుకలు..!!
- భారత్-కువైట్ దౌత్య సంబంధాలకు 65 ఏళ్లు.. మొక్కలు నాటిన భారతీయులు..!!
- తెలంగాణ టీజీ ఐపాస్ పై సైబర్ దాడి
- భద్రతా మండలిలో వీటో అధికారాలపై ఆంక్షలు విధించాలి..!!
- బహ్రెయిన్‌లో కొత్త ఆరోగ్య బీమా నిబంధనలు..!!







