పాక్ లో క్రైస్తవ మహిళకు మరణశిక్ష నుంచి విముక్తి

- October 31, 2018 , by Maagulf
పాక్ లో క్రైస్తవ మహిళకు మరణశిక్ష నుంచి విముక్తి

పాకిస్థాన్‌లో క్రైస్తవ మహిళ ఆసియా బీబీ మరణశిక్ష నుంచి విముక్తి పొందింది. దైవ దూషణకు పాల్పడిన కేసులో .. గతంలో లాహోర్ కోర్టు ఆమెకు మరణశిక్షను ఖరారు చేసింది. అయితే ఇవాళ పాకిస్థాన్ సుప్రీంకోర్టు.. ఆసియా బీబీ అభ్యర్థనను స్వీకరించింది. ఆమెకు ఈ కేసులో ప్రాణ విముక్తి కల్పిస్తున్నట్లు సీజేపీ తెలిపారు. చీఫ్ జస్టిస్ ఆఫ్ పాకిస్థాన్ మియాన్ సాకిబ్ నిసార్‌తో పాటు జస్టిస్ ఆసిఫ్ సయీద్ ఖోసా, జస్టిస్ మజ్‌హర్ ఆలమ్ ఖాన్‌లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఈ తీర్పును వెలువరించింది. దైవాన్ని దూషించిన ఘటనలో 2009లో ఆసియా బీబీపై కేసు నమోదు అయ్యింది. ఓ ట్రయల్ కోర్టు 2010 నవంబర్‌లో ఆమెకు మరణశిక్షను ఖరారు చేసింది. ఆ తీర్పును లాహోర్ హైకోర్టు సమర్థించింది. అయితే ఆ రెండు తీర్పులను రద్దు చేస్తున్నట్లు ఇవాళ సీజేపీ తెలిపారు. ఆసియా బీబీని తక్షణమే రిలీజ్ చేయాలని ఆయన తన తీర్పులో ఆదేశించారు. మొత్తం 56 పేజీల తీర్పును తయారు చేశారు. ఈ కేసులో ఆసియా ఇప్పటికే 8 ఏళ్ల జైలు శిక్షను అనుభవించింది. మహ్మద్ ప్రవక్తను అవమానించినట్లు ఆసియాపై కేసు నమోదు చేశారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com