తెలంగాణ కరోనా అప్డేట్
- July 04, 2022![1 తెలంగాణ కరోనా అప్డేట్](https://www.maagulf.com/godata/articles/202207/tt_1656951495.jpg)
హైదరాబాద్: తెలంగాణలో కరోనావైరస్ మమహ్మరి డేంజర్ బెల్స్ మోగిస్తోంది.వైరస్ చాప కింద నీరులా వ్యాపిస్తోంది. కొత్త కేసులు రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి. తెలంగాణలో వరుసగా 13వ రోజు 400కిపైగా కొవిడ్ కేసులు నమోదవడం ఆందోళనకు గురి చేస్తోంది.
మంగళవారం(జూన్ 21) రాష్ట్రంలో 403 కేసులు, బుధవారం(జూన్ 22) 434 కేసులు, గురువారం(జూన్ 23) 494 కేసులు, శుక్రవారం(జూన్ 24) 493 కేసులు, శనివారం(జూన్ 25) 496 కేసులు, ఆదివారం(జూన్ 26) 434 కేసులు, సోమవారం(జూన్ 27) 477 కేసులు, మంగళవారం(జూన్ 28) 459 కేసులు, గురువారం(జూన్ 30) 468 కేసులు, శుక్రవారం(జులై 1) 462 కేసులు, శనివారం(జులై 2) 516 కేసులు, ఆదివారం(జులై 3) 457 కేసులు నమోదు కాగా.. తాజాగా ఆ సంఖ్య 443గా(జులై 4) ఉంది.
రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 21వేల 918 కరోనా పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 443 మందికి పాజిటివ్ గా తేలింది. అత్యధికంగా హైదరాబాద్ లో 247 కేసులు వచ్చాయి. రంగారెడ్డి జిల్లాలో 34, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 30, సంగారెడ్డి జిల్లాలో 27 కేసులు వెల్లడయ్యాయి. అదే సమయంలో ఒక్కరోజు వ్యవధిలో మరో 493 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఊరటనిచ్చే అంశం ఏంటంటే.. కొత్తగా కొవిడ్ మరణాలేవీ సంభవించలేదు.
రాష్ట్రంలో నేటివరకు 8,02,822 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 7లక్షల 94వేల 014 మంది కోలుకున్నారు.క్రమంగా పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో.. కరోనా యాక్టివ్ కేసుల సంఖ్యా పెరుగుతోంది.రాష్ట్రంలో కొవిడ్ యాక్టివ్ కేసుల సంఖ్య 5వేల మార్క్ కు చేరువ కావడం ఆందోళన కలిగిస్తోంది.రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 4వేల 697కి పెరిగింది.రాష్ట్రంలో నేటివరకు కరోనాతో మరణించిన వారి సంఖ్య 4వేల 111.ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ సోమవారం కరోనా బులెటిన్ విడుదల చేసింది.
తాజా వార్తలు
- ప్రాంతీయ భద్రతకు బహ్రెయిన్, సౌదీ చర్యలు..!
- ఏడాది పొడవునా ఫ్రీ మెడికల్ చికిత్సలు
- 2023లో అర్థిక వృద్ధిలో ఒమన్ దూకుడు
- ఉద్యోగులపై వేధింపులు.. 6నెలల జైలుశిక్ష, Dh5,000జరిమానా
- కువైట్ లో ఆరవ తరం కెమెరా సిస్టమ్ ప్రారంభం
- లెబనాన్ విడిచి వెళ్లాలి.. సౌదీ పౌరులకు అలెర్ట్
- పెన్షన్లపై జరుగుతున్న ప్రచారాన్ని ఖండించిన టీడీపీ
- నైజీరియాలో దారుణం..18 మందికి పైగా మృతి
- పిఠాపురంకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్...
- దుబాయ్ హిల్స్ మాల్‌కు కొత్త బస్సు సర్వీస్