నిఖిల్‌తో జత కట్టనున్న సంయుక్త.!
- August 16, 2023యంగ్ హీరో నిఖిల్ సరసన నటించే ఛాన్స్ కొట్టేసింది అందాల భామ సంయుక్త మీనన్. ‘కార్తికేయ 2’ సినిమాతో నిఖిల్ ప్యాన్ ఇండియా గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ‘కార్తికేయ 2’ తర్వాత ‘18 పేజెస్’తో మరో హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు నిఖిల్ సిద్దార్ధ.
అయితే, ఇటీవల వచ్చిన ‘స్పై’ మూవీ నిఖిల్‌ని నిరాశ పరిచిందనే చెప్పాలి. ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది ఈ సినిమా. అంచనాలు బాగానే క్రియేట్ చేసినా, రిలీజ్ తర్వాత తుస్సుమంది.
ఇక, ఇప్పుడు కొత్త డైరెక్టర్ భరత్ కృష్ణమాచారితో నిఖిల్ ఓ సినిమా చేయబోతున్నాడు. ఈ మధ్యనే ఈ సినిమాని అధికారికంగా ప్రకటించారు. ‘స్వయంభు’ అనే టైటిల్‌తో రూపొందుతోన్న ఈ సినిమా కోసం తాజాగా హీరోయిన్ పేరు ఫిక్స్ చేశారు.
‘విరూపాక్ష’తో సూపర్ సక్సెస్ అందుకున్న సంయుక్త, ప్రస్తుతం స్టార్ ఛైర్ దిశగా దూసుకొస్తోంది. అయితే, ఆచి తూచి అడుగులేస్తోంది. ఏది పడితే అది కాకుండా.. ఇంపార్టెన్స్ వున్న రోల్స్‌ని ఎంచుకుంటోంది. ఆ క్రమంలోనే నిఖిల్ సిద్దార్ధ్ కొత్త సినిమా ‘స్వయంభు’ లో ఎంపికైంది. చూడాలి మరి, ‘స్వయంభు’తో సంయుక్త మరో హిట్ తన ఖాతాలో వేసుకుంటుందేమో.!
తాజా వార్తలు
- హైదరాబాద్, విశాఖ నుంచి కొత్తగా మరిన్ని విమాన సర్వీసులు...!
- తిరిగి ఆనంద్ కు హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ గా బాధ్యతలు..!!
- వినాయక పూజలో పాల్గొన్న సీఎం చంద్రబాబు
- మూడు జోన్లుగా హైడ్రా !
- గదిలో, బాత్రూంలో స్పై కెమెరాలు ఉంటే ఎలా గుర్తించాలి?
- మరింత ఈజీగా ఫ్లైట్ టికెట్ బుకింగ్
- నేడు శ్రీసప్తముఖ మహా శక్తి గణపతి పూజలో సీఎం రేవంత్
- 5.40లక్షల మంది సందర్శకులను ఆకర్షించిన ఆర్ట్ గ్యాలరీలు..!
- ఒమానీల కోసం 32 కొత్త ప్రొఫెషన్స్ రిజర్వ్.. జాబితా ఔట్..!
- ట్రాఫిక్ ప్రమాదాలకు డ్రైవర్ల నిర్లక్ష్యమే కారణమా?