కొత్త పార్లమెంటులో మంగళవారమే తొలి సమావేశం..
- September 18, 2023న్యూ ఢిల్లీ: పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. అయితే వర్షాకాల సాధారణ సమావేశాల్లోనే నూతన పార్లమెంట్ భవనంలో సమావేశాలు ప్రారంభమవుతాయని స్వయంగా కేంద్ర మంత్రి ఒకరు చెప్పినప్పటికీ అది ఆచరణలో సాధ్యం కాలేదు. కాగా, తాజాగా ప్రత్యేక సమావేశాల సందర్భంగా నూతన భవనంలోని పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. మంగళవారం మధ్యాహ్నం 2:15 గంటలకు రాజ్యసభ సమావేశం కానుంది. ఇక నుంచి నూతన భవనంలోనే పార్లమెంట్ కార్యకలాపాలు కొనసాగనున్నాయి.
నూతన పార్లమెంట్ భవనాన్ని మే 28న ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ప్రధాని మోదీతో పాటు లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా కూడా హాజరయ్యారు. కొత్త పార్లమెంటు భవనాన్ని ప్రారంభించడానికి ముందు ప్రధాని మోదీ, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా కొత్త పార్లమెంటు భవనంలో మహాత్మా గాంధీకి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కాసేపు లోక్ సభ హాలులో సమావేశం జరిగింది.
తాజా వార్తలు
- హైదరాబాద్, విశాఖ నుంచి కొత్తగా మరిన్ని విమాన సర్వీసులు...!
- తిరిగి ఆనంద్ కు హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ గా బాధ్యతలు..!!
- వినాయక పూజలో పాల్గొన్న సీఎం చంద్రబాబు
- మూడు జోన్లుగా హైడ్రా !
- గదిలో, బాత్రూంలో స్పై కెమెరాలు ఉంటే ఎలా గుర్తించాలి?
- మరింత ఈజీగా ఫ్లైట్ టికెట్ బుకింగ్
- నేడు శ్రీసప్తముఖ మహా శక్తి గణపతి పూజలో సీఎం రేవంత్
- 5.40లక్షల మంది సందర్శకులను ఆకర్షించిన ఆర్ట్ గ్యాలరీలు..!
- ఒమానీల కోసం 32 కొత్త ప్రొఫెషన్స్ రిజర్వ్.. జాబితా ఔట్..!
- ట్రాఫిక్ ప్రమాదాలకు డ్రైవర్ల నిర్లక్ష్యమే కారణమా?