విటమిన్ ‘బి’ ట్యాబ్లెట్లు ఎక్కువగా వాడుతున్నారా.?
- October 26, 2023శరీరం ఆరోగ్యంగా వుండాలంటే విటమిన్లు చాలా అవసరం. శరీరంలో చాలా కీలకమైన పనులు చేస్తుంటాయ్ విటమిన్లు. ఆరోగ్యంగా వుండాలంటే తగినన్ని విటమిన్లు శరీరానికి అందాల్సిందే. ముఖ్యంగా విటమిన్ ‘బి’ అత్యంత కీలకమైన జీర్ణశయ అంతరాళానికి సంబంధించిన పనుల్లో ముఖ్యమైన పాత్ర వహిస్తుంది.
అందుకే శరీరానికి తగినంత ‘బి’ విటమిన్ అందాలని.. వైద్యులు సూచిస్తుంటారు. తీసుకునే ఆహారం ద్వారా విటమిన్ బి తగిన మోతాదులో అందకపోతే, బి కాంప్టెక్స్ సప్లిమెంట్స్ సూచిస్తుంటారు వైద్యులు.
అయితే, వైద్య సలహాలు లేకుండానే విటమిన్ బి కాంప్లెక్స్ విరివిగా వాడేస్తుంటారు కొందరు. అలా వాడడం వల్ల చాలా సైడ్ ఎఫెక్టులు వస్తాయనీ, ఆరోగ్యపరంగా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
అతిగా విటమిన్ బి కాంప్లెక్స్ వాడడం వల్ల శరీరంపై దద్దుర్లు, దురద వచ్చే అవకాశాలున్నాయ్. అలాగే, అజీర్తి, విరేచనాలు వాంతులు వంటి జీర్ణ సంబంధిత సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.
మోకాళ్లలో తిమ్మిర్లు వేధిస్తుంటాయ్. ఎక్కువ సేపు నడిచినా, నిలబడినా ఈ తిమ్మిర్లు బాధిస్తుంటాయ్. నిద్రపై అధిక ప్రభావం పడుతుంది. తద్వారా ఒత్తిడికి లోనై చికాకు, కోపం వంటి అననుకూల ప్రభావాలకు గురవుతుంటారు. సో, విటమిన్ బి కాంప్లెక్స్ సప్లిమెంట్స్ తీసుకునే విషయంలో చాలా జాగ్రత్తగా వుండాలని వైద్యుల సలహా.
తాజా వార్తలు
- హైదరాబాద్, విశాఖ నుంచి కొత్తగా మరిన్ని విమాన సర్వీసులు...!
- తిరిగి ఆనంద్ కు హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ గా బాధ్యతలు..!!
- వినాయక పూజలో పాల్గొన్న సీఎం చంద్రబాబు
- మూడు జోన్లుగా హైడ్రా !
- గదిలో, బాత్రూంలో స్పై కెమెరాలు ఉంటే ఎలా గుర్తించాలి?
- మరింత ఈజీగా ఫ్లైట్ టికెట్ బుకింగ్
- నేడు శ్రీసప్తముఖ మహా శక్తి గణపతి పూజలో సీఎం రేవంత్
- 5.40లక్షల మంది సందర్శకులను ఆకర్షించిన ఆర్ట్ గ్యాలరీలు..!
- ఒమానీల కోసం 32 కొత్త ప్రొఫెషన్స్ రిజర్వ్.. జాబితా ఔట్..!
- ట్రాఫిక్ ప్రమాదాలకు డ్రైవర్ల నిర్లక్ష్యమే కారణమా?