ఒమన్ డెవలప్మెంట్ బ్యాంక్ పునర్నిర్మణం.. రాయల్ డిక్రీ జారీ
- November 21, 2023మస్కట్: ఒమన్ డెవలప్మెంట్ బ్యాంక్‌ను పునర్నిర్మించడంపై హిజ్ మెజెస్టి సుల్తాన్ హైతం బిన్ తారిక్ సోమవారం రాయల్ డిక్రీ నంబర్ 84/2023ని జారీ చేశారు. ఆర్టికల్ (1) "ఒమన్ డెవలప్మెంట్ బ్యాంక్" పేరు "డెవలప్మెంట్ బ్యాంక్"గా సవరించబడుతుంది. ఆర్టికల్ (2) రాయల్ డిక్రీ నం. 18/2019 కింద ప్రకటించబడిన వాణిజ్య కంపెనీల చట్టానికి అనుగుణంగా డెవలప్మెంట్ బ్యాంక్ తన అనుబంధ కథనాలను రూపొందించనున్నారు. ఆర్టికల్ (3) ప్రకారం ఈ డిక్రీ నిబంధనలు దాని అమలు తేదీకి ముందు ఉత్పన్నమయ్యే హక్కులు లేదా బాధ్యతలకు ఇబ్బంది లేకుండా పునర్ నిర్వచించనున్నారు. ఆర్టికల్ (4) ప్రకారం.. ఆర్థిక మంత్రి ఈ బ్యాంక్ పై కార్యనిర్వాహక నియంత్రణను కలిగిఉంటారు.ఆర్టికల్ (5) కింద చట్టానికి విరుద్ధమైన లేదా వాటి నిబంధనలకు విరుద్ధంగా ఉన్న అన్నింటినీ రద్దు చేస్తారు. ఆర్టికల్ (6) ప్రకారం, ఈ డిక్రీ అధికారిక గెజిట్‌లో ప్రచురించబడుతుంది. ప్రచురించబడిన తేదీ తర్వాత రోజు నుండి అమలులోకి వస్తుంది.
తాజా వార్తలు
- UAE: సెప్టెంబర్ 1 తర్వాత వీసా ఉల్లంఘనలకు పాల్పడితే..?
- చికాగోలో NATS హైవే దత్తత కార్యక్రమం
- రేపు ఉదయం 7 గంటలకు ఖైరతాబాద్ గణేష్ శోభా యాత్ర మొదలు
- 4వ గ్లోబల్ రెన్యువబుల్ ఎనర్జీ ఇన్వెస్టర్స్ మీట్ & ఎక్స్పో ప్రారంభం
- ఒమాన్ లో రాబోయే మూడు రోజుల్లో ఉష్ణోగ్రతలు ఎలా ఉంటాయంటే...
- మార్చి 2025 నాటికి గల్ఫ్ కు ఎయిర్ కేరళ సర్వీసులు
- కేరళలో నిఫా టెన్షన్
- 65 వసంతాలు పూర్తి చేసుకున్న దూరదర్శన్
- మెడికవర్ హాస్పిటల్స్ లో హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ విజయవంతం
- వరద బాధితులకు TANA ఫౌండేషన్ సహాయ కార్యక్రమాలు ముమ్మరం