ఎసిడిటీ కూడా గుండెనొప్పిని సూచిస్తుందా.?
- December 20, 2023తిన్న ఆహారం జీర్ణం కాకుండా, అదే తడవుగా త్రేన్పులు రావడం, ఛాతీలో మంటగా అనిపించడం వంటి లక్షణాలను సహజంగా గ్యాస్ నొప్పి అంటుంటాం. అదే ఎసిడిటీగా కూడా పిలుస్తుంటాం. ఇదు సమయంలో ఛాతీలో నొప్పి తీవ్రంగా వేధిస్తుంటుంది. అయితే, ఈ ఛాతీ నొప్పికీ, గుండె నొప్పికీ తేడా ఏంటీ.?
ఆహారం జీర్ణం కాకుంటే, ఎసిడిటీ వస్తుంది. ఛాతీలో మంటలు ఏర్పడతాయ్. ఈనో కానీ, కాస్త వాము, జీలకర్ర వంటివి తీసుకుంటే ఆ మంటలు చల్లారిపోతాయ్.
అలాగే, హెర్నియాలో బాధపడేవారిలోనూ ఛాతీలో మంటలు వేధిస్తుంటాయ్ అప్పుడప్పుడూ. పేగు క్యాన్సర్ వున్నవాళ్లలోనూ ఛాతీలో మంట బాధపెడుతుంది.
కొన్ని రకాల ఆహార పదార్ధాలు తీసుకున్నప్పుడు, కొన్ని రకాల యాసిడ్స్ విడుదలవుతుంటాయ్. అలాంటి సమయంలోనూ ఛాతీలో మంటలు వేధిస్తుంటాయ్.
అయితే, అన్ని సందర్భాల్లోనూ ఛాతీ మంటని గుండె పోటుగా పరిగణించలేం. అలాగని అశ్రద్ధ కూడా చేయలేం. ఛాతీలో మంటతో పాటూ, సడెన్గా శరీర ఉష్ణోగ్రత పెరగడం, అదే సమయంలో ఒళ్లంతా చెమటలు పట్టడం, శరీరమంతా బిగుసుకుపోతున్నట్లు కనిపించడం.. కొందరిలో వాంతులు, వికారం వంటి లక్షణాలు కనిపిస్తాయ్. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే మాత్రం వెంటనే వైద్యుని సంప్రదించాలి.
తాజా వార్తలు
- హైదరాబాద్, విశాఖ నుంచి కొత్తగా మరిన్ని విమాన సర్వీసులు...!
- తిరిగి ఆనంద్ కు హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ గా బాధ్యతలు..!!
- వినాయక పూజలో పాల్గొన్న సీఎం చంద్రబాబు
- మూడు జోన్లుగా హైడ్రా !
- గదిలో, బాత్రూంలో స్పై కెమెరాలు ఉంటే ఎలా గుర్తించాలి?
- మరింత ఈజీగా ఫ్లైట్ టికెట్ బుకింగ్
- నేడు శ్రీసప్తముఖ మహా శక్తి గణపతి పూజలో సీఎం రేవంత్
- 5.40లక్షల మంది సందర్శకులను ఆకర్షించిన ఆర్ట్ గ్యాలరీలు..!
- ఒమానీల కోసం 32 కొత్త ప్రొఫెషన్స్ రిజర్వ్.. జాబితా ఔట్..!
- ట్రాఫిక్ ప్రమాదాలకు డ్రైవర్ల నిర్లక్ష్యమే కారణమా?