దెబ్బతిన్న ఇళ్లకు ఉచితంగా మరమ్మతులు… ఎమ్మార్
- April 20, 2024దుబాయ్: భారీ వర్షాల సమయంలో దెబ్బతిన్న దుబాయ్‌లోని తమ కమ్యూనిటీలలోని అన్ని ఇళ్లకు ఉచితంగా మరమ్మతులు చేస్తామని ఎమ్మార్ ప్రాపర్టీస్ శుక్రవారం తెలిపింది. ఈ మేరకు ఎమ్మార్ ప్రాపర్టీస్ చైర్మన్ మొహమ్మద్ అలబ్బర్ తెలిపారు. వర్షాల కారణంగా తీవ్రంగా ప్రభావితమైన ఎమ్మార్ కమ్యూనిటీలలోని వేలాది మంది నివాసితులకు ఈ నిర్ణయం ఉపశమనం కలిగిస్తోందన్నారు.
దుబాయ్‌కి చెందిన ఎమ్మార్ ప్రాపర్టీస్ ఎమిరేట్‌లో అతిపెద్ద మాస్టర్ డెవలపర్. డౌన్‌టౌన్ దుబాయ్, ఎమ్మార్ సౌత్, దుబాయ్ హిల్స్ ఎస్టేట్, దుబాయ్ క్రీక్ హార్బర్, అరేబియన్ రాంచెస్, దుబాయ్ మెరీనా, ది వ్యాలీ మరియు అడ్రస్ రెసిడెన్స్ జబీల్ వీటి ప్రాజెక్టులు. 2002 నుండి దుబాయ్ మరియు ఇతర మార్కెట్లలో సుమారు 108,000 రెసిడెన్షియల్ యూనిట్లను డెలివరీ చేసింది.
తాజా వార్తలు
- హైదరాబాద్, విశాఖ నుంచి కొత్తగా మరిన్ని విమాన సర్వీసులు...!
- తిరిగి ఆనంద్ కు హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ గా బాధ్యతలు..!!
- వినాయక పూజలో పాల్గొన్న సీఎం చంద్రబాబు
- మూడు జోన్లుగా హైడ్రా !
- గదిలో, బాత్రూంలో స్పై కెమెరాలు ఉంటే ఎలా గుర్తించాలి?
- మరింత ఈజీగా ఫ్లైట్ టికెట్ బుకింగ్
- నేడు శ్రీసప్తముఖ మహా శక్తి గణపతి పూజలో సీఎం రేవంత్
- 5.40లక్షల మంది సందర్శకులను ఆకర్షించిన ఆర్ట్ గ్యాలరీలు..!
- ఒమానీల కోసం 32 కొత్త ప్రొఫెషన్స్ రిజర్వ్.. జాబితా ఔట్..!
- ట్రాఫిక్ ప్రమాదాలకు డ్రైవర్ల నిర్లక్ష్యమే కారణమా?