సౌదీలో SR3000 గరిష్ఠ డ్యూటీ ఫ్రీ పరిమితి విధింపు
- May 15, 2024రియాద్: కింగ్డమ్లోని లాంజ్లలో ప్రయాణీకులకు గరిష్ట కొనుగోలు పరిమితిని సౌదీ జకాత్, టాక్స్ అండ్ కస్టమ్స్ అథారిటీ (జాట్కా) నిర్దేశించింది. అరైవింగ్ లాంజ్లలో డ్యూటీ-ఫ్రీ మార్కెట్ల నుండి గరిష్ట కొనుగోలు పరిమితి ఒక ప్రయాణీకుడికి SR3,000 అని పేర్కొంది. ఆన్ గోయింగ్ లాంజ్లలో డ్యూటీ-ఫ్రీ మార్కెట్ల ఆపరేటర్లకు మంజూరు చేసిన లైసెన్సుల కొనసాగింపులో భాగంగా తాజా నిర్ణయం తీసుకున్నట్లు జాట్కా వెల్లడించింది. లాంజ్లలో డ్యూటీ-ఫ్రీ మార్కెట్ల ఆపరేటర్ల నియమాలు, నిబంధనలను అథారిటీ సోషల్ మీడియా అకౌంట్లు, కస్టమ్స్ ద్వారా 24/7 పనిచేసే యూనిఫైడ్ కాల్ సెంటర్ నంబర్ 19993 ద్వారా సంప్రదించాలని సూచించింది. [email protected], లేదా వెబ్సైట్ jatca.gov.sa లో లైవ్ చాట్ ద్వారా కూడా తెలుసుకోవచ్చని తెలిపింది. డ్యూటీ-ఫ్రీ మార్కెట్లు రాజ్యానికి వచ్చే ప్రయాణీకుల అనుభవాన్ని పెంచుతాయని పేర్కొంది. అంతకుముందు, గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ (జిసిసి) దేశాల ఏకీకృత కస్టమ్స్ వ్యవస్థకు అనుగుణంగా ఎయిర్, సీ మరియు ల్యాండ్ ఎంట్రీ పాయింట్ల వద్ద డ్యూటీ-ఫ్రీ మార్కెట్లను స్థాపించే కస్టమ్స్ నియమాలు, షరతులు మరియు విధానాలను అథారిటీ జారీ చేసింది.
తాజా వార్తలు
- హైదరాబాద్, విశాఖ నుంచి కొత్తగా మరిన్ని విమాన సర్వీసులు...!
- తిరిగి ఆనంద్ కు హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ గా బాధ్యతలు..!!
- వినాయక పూజలో పాల్గొన్న సీఎం చంద్రబాబు
- మూడు జోన్లుగా హైడ్రా !
- గదిలో, బాత్రూంలో స్పై కెమెరాలు ఉంటే ఎలా గుర్తించాలి?
- మరింత ఈజీగా ఫ్లైట్ టికెట్ బుకింగ్
- నేడు శ్రీసప్తముఖ మహా శక్తి గణపతి పూజలో సీఎం రేవంత్
- 5.40లక్షల మంది సందర్శకులను ఆకర్షించిన ఆర్ట్ గ్యాలరీలు..!
- ఒమానీల కోసం 32 కొత్త ప్రొఫెషన్స్ రిజర్వ్.. జాబితా ఔట్..!
- ట్రాఫిక్ ప్రమాదాలకు డ్రైవర్ల నిర్లక్ష్యమే కారణమా?