రాణి ఝాన్సీ లక్ష్మీబాయి

- June 18, 2024 , by Maagulf
రాణి ఝాన్సీ లక్ష్మీబాయి

ఆడదంటే అబలకాదని.. ఒక్క ఆడది తలుచుంకుంటే ఏమైనా చేయగలదు అని ప్రపంచానికి చాటి చెప్పిన.. ఒక్క గొప్ప వ్యక్తి ..రాణి ఝాన్సీ లక్ష్మీబాయి. భారతదేశంలో స్త్రీల శక్తి గురించి మాట్లాడినప్పుడల్లా ముందుగా గుర్తుకు వచ్చే పేరు రాణి లక్ష్మీ బాయి. ప్రతి ఒక్క ఆడపిల్లకు ఆమె ఒక ఆదర్శం. నేడు ప్రముఖ స్వాతంత్ర సమరయోధురాలు రాణి ఝాన్సీ లక్ష్మీబాయి వర్ధంతి.

ఝాన్సీ లక్ష్మీబాయి అసలు పేరు మణికర్ణిక. ఆమె 1828వ సంవత్సరము నవంబరు నెల 19 న మహారాష్ట్ర కు చెందిన సతారలో ఒక కర్హాడీ బ్రాహ్మణుల వంశంలో వారణాసిలో విక్రమ నామ సంవత్సరం బహుళ పంచమీ నాడు జన్మించింది. ఝాన్సీ లక్ష్మీబాయి అసలు పేరు మణికర్ణిక. ఆమె 1828వ సంవత్సరము నవంబరు నెల 19 న మహారాష్ట్ర కు చెందిన సతారలో ఒక కర్హాడీ బ్రాహ్మణుల వంశంలో వారణాసిలో విక్రమ నామ సంవత్సరం బహుళ పంచమీ నాడు జన్మించింది. ఈమె తల్లిదండ్రులు మోరోపంత్ తాంబే, భాగీరథీబాయిలు. వీళ్ళది సాంప్రదాయ బ్రాహ్మణ కుటుంబం. ఆమె తల్లి చాలా తెలివైనది, ఆధ్యాత్మిక ధోరణి మెండుగా కలది.

ఝాన్సీ లక్ష్మీబాయిని ముద్దుగా మను అని పిలుచుకునేవారు. మను నాలుగేళ్ళ ప్రాయంలో ఉండగానే ఆమె తల్లి కన్ను మూసింది. దాంతో ఆమెను పెంచాల్సిన బాధ్యత తండ్రి మీద పడింది. అటువంటి క్లిష్ట సమయంలో బాజీరావు పీష్వా మోరోపంత్ ను బిఠూర్ కు పిలిపించి ఆశ్రయమిచ్చి ఆదుకున్నాడు. చిన్నతనం నుంచే  కత్తిసాము, గుర్రపుస్వారీ, తుపాకీ పేల్చడం వండి విద్యలంటే మనుకు మక్కువ ఎక్కువ.

13 ఏళ్ళ వయసులోనే 1842లో ఝాన్సీ పట్టణానికి రాజైన గంగాధరరావుతో వివాహమైంది.దీంతో ఆమె ఝాన్సీ పట్టణానికి మహారాణి అయింది. అప్పటి ఆచారాల ప్రకారం మహారాణి అయిన తర్వాత ఆమె పేరు లక్ష్మీబాయి అయింది. లక్ష్మీబాయి ఒక కుమారునికి జన్మనిచ్చింది. అయితే ఆ పిల్లవాడు నాలుగు నెలల వయసులోనే కన్నుమూశాడు.వారసులెవ్వరూ లేకుండానే గంగాధరరావు మరణించారు. అయితే రాజ్యానికి వారసుడిగా దూరపు బందువైన వాసుదేవ నేవల్కర్ కుమారుడైన దామోదర్ రావు అనే పిల్లవాడిని చనిపోవడానికి కేవలం ఒక్క రోజు ముందుగానే దత్తత తీసుకున్నారు.

 హిందూ సాంప్రదాయం ప్రకారం దామోదర్ రావు రాజ్యానికి వారసుడు కావల్సి ఉన్నా అప్పటి బ్రిటీష్ భారత గవర్నర్ జనరల్ గా ఉన్న డల్హౌసీ  ఒప్పుకోలేదు. ఈస్ట్ ఇండియా కంపనీ  సిద్ధాంతం ప్రకారం దామోదర్ రావు సింహాసనాన్ని అధిష్టించే అధికారం లేదని పేర్కొనడం జరిగింది. దాంతో గొడవ మొదలైంది. ప్రతిఘటనలు, నిరసనలు ఎదురైనప్పటికీ ఝాన్సీ లక్ష్మీభాయ్ కి అయిదువేల రూపాలయ చిన్నమొత్తాన్ని భరణంగా ఇవ్వసాగారు. అయితే ఈ అగౌరవాన్ని, పరాయి వారికి లోబడి ఉండడాన్ని జీర్ణించుకోలేకపోయారు. సంస్ధానాన్ని వదిలిపెట్టకూడదనుకున్నారు.

1857 మే నెలలో బ్రిటిష్ ప్రభుత్వంపై తిరుగుబాటు చేశారు. ఝాన్సీ సంస్ధానమంతా రాణీ లక్ష్మీబాయిదే అధికారమని ప్రకటించారు. బ్రిటిష్ సేన దండయాత్రకు దిగితే  వారిని ఎదుర్కొని... గ్వాలియర్ కోటను లక్ష్మీబాయి తన అధీనంలోకి తీసుకుంది. అది చూసి గ్వాలియర్ మహారాజు కోట వదిలి పరిగెత్తాడు. ఆయన బలగాల్లో అత్యధిక శాతం లక్ష్మీబాయి పక్షం వచ్చేసాయి. దెబ్బతిన్న బ్రిటిష్ వారు గ్వాలియర్ కోట మీద ఒక్కసారి దాడి చేశారు. లక్ష్మీ బాయ్ తీవ్రపోరాటం చేసినప్పటికీ ఆ పోరులో  జూన్ 18, 1858 న  మరణించింది. ఆ విధంగా తన ఇంటికి సుదూరప్రాంతంలో రాని అశువులు బాసింది. కానీ బ్రిటిష్ వారి మీద ఝాన్సీ లక్ష్మీ భాయి చూపిన ధైర్యసాహసాలు బలపరాక్రమాలు, సామర్ధ్యం భారతీయులెవ్వరూ ఎప్పటికీ మరిచిపోరు. ఆమె చిరస్మరణీయురాలు.

-డి.వి.అరవింద్(మాగల్ఫ్ ప్రతినిధి) 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com