వెనక్కి తగ్గిన ‘పుష్ప’.! రీజన్ అదేనా.?

- June 18, 2024 , by Maagulf
వెనక్కి తగ్గిన ‘పుష్ప’.! రీజన్ అదేనా.?

ఆగస్ట్ 15న ఎట్టి పరిస్థితుల్లోనూ ‘పుష్ప 2’ రిలీజ్ అవుతుందని గట్టిగా చెప్పింది చిత్ర యూనిట్. ఈ రిలీజ్ డేట్ విషయంలో మొదట్లో కొన్ని అనుమానాలున్నప్పటికీ మళ్లీ మళ్లీ అదే మాట నొక్కి వక్కానించింది సుక్కు అండ్ టీమ్.!

అయితే అంత చేసినా తప్పలేదు. రిలీజ్ పోస్ట్‌పోన్ అయ్యింది. ఒక నెల కాదు, రెండు నెలలు కాదు, ఏకంగా డిశంబర్‌కెళ్లిపోయింది. డిశంబర్ 6న ‘పుష్ప 2’ రిలీజ్ కానుందని చిత్ర యూనిట్ కొత్త పోస్టర్ రిలీజ్ చేసింది.

దాంతో, అల్లు అర్జున్ ఫ్యాన్స్ కాస్త ఢీలా పడిపోయారు. అయితే, ఇంత వెనక్కి వెళ్లడానికి కారణమేంటీ.? ప్రస్తుతం పరిస్థితులేమీ అల్లు అర్జున్‌కి అనుకూలంగా లేవు. ఎలక్షన్స్ టైమ్‌లో అల్లు అర్జున్ చేసిన ఓవరాక్షన్‌కి మెగా ఫ్యాన్స్ బన్నీపై గుస్సా అవుతున్నారు.

బన్నీకి సెపరేట్‌గా ఫ్యాన్ బేస్ వున్నప్పటికీ మెయిన్ స్ట్రీమ్ ఫ్యాన్స్ మాత్రం మెగా ఫ్యాన్సే. దాంతో, ఈ టైమ్‌లో ‘పుష్ప 2’ రిలీజ్ చేస్తే అది అల్లు అర్జున్‌కి ఖచ్చితంగా దెబ్బ పడే పరిస్థితే అవుతుంది. ఇదో రీజన్ కాగా, భారీ అంచనాల నడుమ, భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ప్యాన్ ఇండియా సినిమా ఇది. దాంతో, ప్రతి చిన్న విషయమూ చాలా జాగ్రత్తగా చూసుకోవల్సి వుంటుంది. ఇలా సవాలక్ష కారణాలు ఈ సినిమా పోస్ట్ పోన్ అవ్వడానికి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com