‘మిస్టర్ బచ్చన్’ ఫస్ట్ ఇంప్రెషన్ కొట్టేశాడుగా.!
- June 18, 2024‘షాక్’, ‘మిరపకాయ్’ సినిమాల తర్వాత హరీష్ శంకర్, మాస్ రాజా రవితేజ కాంబినేషన్లో వస్తున్న సినిమా ‘మిస్టర్ బచ్చన్’. ఈ సినిమాని వీలైనంత ఎర్లీగా పూర్తి చేసి రిలీజ్ చేయాలనుకుంటున్నారు.
ఎలాగూ రీమేక్ సినిమానే కాబట్టి.. పని కాస్త ఈజీనే అనుకోవచ్చు. బాలీవుడ్ సూపర్ హిట్ చిత్రం ‘రైడ్’కి రీమేక్‌గా ఈ సినిమా తెరకెక్కుతోంది. మొదట్లో వేర్వేరు హీరోల్ని ఈ సినిమాలో అనుకున్నారు.
ఫైనల్‌గా మాస్ రాజా రవితేజ వచ్చి చేరారు ఈ ప్రాజెక్టులోకి. సినిమా అవుట్ పుట్ చాలా బాగా వస్తోందట. తాజాగా రిలీజ్ చేసిన వీడియో ఒకటి ఆ విషయాన్ని ప్రూవ్ చేస్తోంది కూడా. ఎటువంటి డైలాగుల్లేకుండానే కంప్లీట్ యాక్షన్ మోడ్‌లో కట్ చేసిన ఈ వీడియో నెటిజన్స్ నుంచి మంచి రెస్పాన్స్ అందుకుంటోంది.
ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ద బెస్ట్ ఇంప్రెషన్ అంటారు కదా. అలా ‘బచ్చన్’కి ఫస్ట్ ఇంప్రెషన్ వచ్చేసింది. ఈ సినిమాతో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా పరిచయమవుతోంది. మాస్ రాజా విశ్వరూపం చూపించబోతున్నారు ఈ సినిమాలో.
ఎలాగైనా ఈ కాంబోలో హ్యాట్రిక్ పడాలన్న తపన జస్ట్ ఈ టీజర్లోనే సుస్పష్టంగా కనిపిస్తోంది. ఇక, రిలీజ్ డేట్ విషయంలోనూ కొంత డిస్కషన్ జరుగుతోంది. ఎలాగూ ‘పుష్ప’ రిలీజ్ వాయిదా పడడంతో మాస్ రాజా ఆ డేట్స్‌లో ఏమైనా అడ్జస్ట్ అవుతాడేమో చూడాలి మరి. ఒకవేళ అదే జరిగితే, రవితేజ ఫ్యాన్స్‌కి పండగే.
తాజా వార్తలు
- విద్యార్థుల నుంచి లంచం..టీచర్‌కు మూడేళ్ల జైలు, 5,000 దిర్హామ్‌ల జరిమానా..!!
- సౌదీయేతరులతోనే 64.8% సౌదీల వివాహాలు..అధ్యయనం వెల్లడి..!!
- షేక్ జాయెద్ రోడ్లో యాక్సిడెంట్.. 4.2 కి.మీ పొడవున ట్రాఫిక్ జామ్..!!
- దోహాలో రెండు కీలక రహదారులు తాత్కాలికంగా మూసివేత..!!
- కువైట్ లో తక్షణ చెల్లింపు కోసం 'WAMD' సర్వీస్ ప్రారంభం..!!
- మెట్రో రైడర్స్ కు గుడ్ న్యూస్.. ఈ-స్కూటర్లపై నిషేధం ఎత్తివేత..!!
- షార్ట్స్‌లో వీడియోల నిడివిని పెంచిన యూట్యూబ్
- కాంగో పడవ ప్రమాదంలో 78 మంది జల సమాధి
- రేపటి నుంచి భారత్–బంగ్లా టీ20 టిక్కెట్ల విక్రయం
- తిరుమల తిరుపతి శ్రీవారికి చంద్రబాబు దంపతులు పట్టు వస్త్రాలు