ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు జులై 12న ఉప ఎన్నిక

- June 18, 2024 , by Maagulf
ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు జులై 12న ఉప ఎన్నిక

న్యూఢిల్లీ: నాలుగు రాష్ట్రాల్లోని ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు జులై 12న ఉప ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఎలక్షన్‌ కమిషన్‌ (EC) మంగళవారం ప్రకటించింది. ఎమ్మెల్సీల రాజీనామాలతో ఐదింటిలో మూడు స్థానాలకు ఉప ఎన్నిక తప్పనిసరైందని ఇసి తెలిపింది. అనర్హత వేటు కారణంగా మరో రెండు స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహించనున్నట్లు ప్రకటించింది.

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి జగదీష్‌ షెట్టర్‌ ఈ ఏడాది జనవరిలో ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్న ధార్వాడా సెంట్రల్‌ స్థానం అసెంబ్లీ ఎన్నికలకు టిక్కెట్‌ నిరాకరించడంతో బిజెపిని వీడి కాంగ్రెస్‌లో చేరారు. లోక్‌సభ ఎన్నికలకు ముందు తిరిగి బిజెపిలో చేరి ఎంపిగా గెలిచారు.   యుపిలోని సమాజ్‌ వాది పార్టీ అభ్యర్థి మౌర్య ఈ ఏడాది ఫిబ్రవరిలో పార్టీకి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు.

సిట్టింగ్‌ సభ్యులపై అనర్హత వేటు వేయడంతో ఎపి, బీహార్‌లలో ఒక్కోసీటు ఖాళీ అయింది. ఏప్రిల్‌లో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్సీ షేక్‌ మహమ్మద్‌ ఇక్బాల్‌ పార్టీకి రాజీనామా చేయడంతో ఎపి శాసనమండలిలో మరోస్థానం ఖాళీ అయింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com