ఉద్యోగాలు లేకుండానే యూఏఈకి ప్రవాసుల రాక.. అధ్యయనం

- June 26, 2024 , by Maagulf
ఉద్యోగాలు లేకుండానే యూఏఈకి ప్రవాసుల రాక.. అధ్యయనం

యూఏఈ: నియామక సంస్థ రాబర్ట్ హాఫ్ మంగళవారం విడుదల చేసిన కొత్త అధ్యయనం ప్రకారం.. దాదాపు 49 శాతం మంది ప్రవాసులు చేతిలో ఉద్యోగం లేకుండానే యూఏఈకి తరలివస్తున్నారు.  విజిట్ వీసాపై ఎమిరేట్స్‌ వచ్చాక వారు ఉద్యోగాల కోసం వెతుకుతున్నారని వెల్లడించింది. ఉద్యోగం దొరకని వారు తమ స్వదేశాలకు తిరిగి వెళ్లడమో లేదా తక్కువ జీతంతో ఉద్యోగాలను చేయడమో చేస్తున్నారు.

అక్టోబరు 2022లో యూఏఈ ఇతర ఎంట్రీ అనుమతులతో పాటు జాబ్ సెర్చ్ వీసాను ప్రకటించింది. దేశంలో ఆర్థిక వ్యవస్థ అసాధారణమైన వేగంతో అభివృద్ధి చెందడంతో పాటు వివిధ రంగాలలో ఉద్యోగాలను సృష్టించడం ద్వారా దేశంలో ఉద్యోగాల కోసం ప్రజలను అనుమతించింది. దీంతో సులభంగా ఉద్యోగం దొరుకుతుందనే అంచనాతో ప్రవాసులు వస్తున్నారని రాబర్ట్ హాఫ్‌లో మిడిల్ ఈస్ట్ వ్యవహారాలు చూసే గారెత్ ఎల్ మెట్టౌరీ వెల్లడించారు. 

గ్లోబల్ రిక్రూట్‌మెంట్ సంస్థ రాబర్ట్ హాఫ్ ప్రకారం.. 71 శాతం మంది యూఏఈ నియామక నిర్వాహకులు గత 12 నెలల్లో తమ సంస్థలకు కార్మికుల నియామకం సులభమైందని తెలిపారు.    72 శాతం యజమానులు రాబోయే ఆరు నెలల్లో కొత్త నియామకాలను చేపట్టాలని యోచిస్తున్నారు. బలమైన యూఏఈ ఆర్థిక వ్యవస్థ వ్యాపార వృద్ధికి మద్దతు ఇస్తోందని, సగం మంది కొత్త ఉద్యోగులను నియమించుకోవాలని చూస్తున్నారట. ఇదే సమయంలో దాదాపు 30 శాతం మంది యజమానులు ఖాళీగా ఉన్న జాబ్ వెకెన్సీలను భర్తీ చేయాలని చూస్తున్నారు.   

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com