పాన్ కార్డు స్కామ్‌లతో జాగ్రత్త..

- June 26, 2024 , by Maagulf
పాన్ కార్డు స్కామ్‌లతో జాగ్రత్త..

పాన్ కార్డ్ స్కామ్ గురించి ఎప్పుడైనా విన్నారా? కొన్నేళ్లుగా ఈ పాన్ కార్డుతో జరిగే మోసాల సంఖ్య భారీగా పెరుగుతోంది. అమాయక ప్రజలను మోసం చేసి పాన్ కార్డు ద్వారా విలువైన సమాచారంతో పాటు నగదును దోచుకుంటున్నారు సైబర్ నేరగాళ్లు. ఆర్థిక నష్టంతో పాటు బాధితుడికి చట్టపరమైన చిక్కులు కూడా కలిగే ప్రమాదం ఉంది.గత కొన్నేళ్లుగా, పాన్‌కార్డులతో లక్షల నగదును కొల్లగొట్టిన ఘటనలు అనేకం వెలుగులోకి వచ్చాయి.

కొన్ని సంవత్సరాల క్రితం.. హ్యాకర్లు ప్రత్యేకంగా పాన్ కార్డ్ స్కామ్ ద్వారా ఎస్బీఐ వినియోగదారులను లక్ష్యంగా చేసుకున్నారు. ఇప్పుడు ఐటీఆర్ 2023-24 ఫైలింగ్ తేదీలు దగ్గర పడుతుండటంతో ఈ పాన్ కార్డు మోసాలు మరోసారి వెలుగులోకి వస్తున్నాయి.

ఇలాంటి స్కామ్‌ల బారిన పడటం చాలా తేలికే అయినప్పటికీ, వ్యక్తిగత సమాచారాన్నిషేర్ చేసేటప్పుడు కొన్ని ప్రాథమిక విషయాల గురించి జాగ్రత్తగా వహించాలి.తద్వారా అలాంటి మోసాలను చాలా వరకు నివారించవచ్చు. పాన్ కార్డ్ స్కామ్ అంటే ఏమిటి? దాన్ని ఎలా గుర్తించాలి? మీరు ఎప్పుడైనా ఇలాంటి సంఘటనకు గురైతే దాన్ని ఎలా రిపోర్టు చేయొచ్చు అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

పాన్ కార్డ్ స్కామ్ అంటే ఏమిటి?
పాన్ కార్డ్ స్కామ్ అనేది ఒక వ్యక్తి పాన్ (PAN) కార్డ్‌ని దుర్వినియోగం చేస్తుంది. భారత్‌లో పన్ను ప్రయోజనాల కోసం పాన్ కార్డు గుర్తింపుగా పనిచేస్తుంది. ఐడెంటిటీ థెఫ్ట్, బ్యాంకు అకౌంట్లను ఓపెన్ చేయడం, రుణాలు పొందడం, అనధికారిక లావాదేవీలు చేయడం లేదా ఫేక్ పన్ను రిటర్న్‌లను దాఖలు చేయడం వంటి చట్టవిరుద్ధమైన కార్యకలాపాలను నిర్వహించడానికి మోసగాళ్లు మీ పాన్ కార్డ్ వివరాలను దొంగిలించవచ్చు. బాధితులకు ఆర్థిక నష్టం, చట్టపరమైన చిక్కులను కలిగిస్తాయి. దుర్వినియోగాన్ని నివారించడానికి వెంటనే సంబంధిత అధికారులకు రిపోర్టు చేయడం చాలా ముఖ్యం.

పాన్ కార్డ్ స్కామ్‌ను ఎలా గుర్తించాలి?
మీ పాన్ కార్డ్ దుర్వినియోగం అయిందో లేదో చూడటానికి మీరు ఏవైనా అసాధారణమైన లేదా అనధికారిక యాక్సస్ పొందినట్టు గుర్తిస్తే.. మీ ఆర్థిక, పన్ను కార్యకలాపాలను ట్రాక్ చేయవచ్చు. వెంటనే చెక్ చేయవచ్చు. మీరు ఈ కింది విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com