సాల్వా రహదారి తాత్కాలికంగా మూసివేత

- June 28, 2024 , by Maagulf
సాల్వా రహదారి తాత్కాలికంగా మూసివేత

దోహా: పబ్లిక్ వర్క్స్ అథారిటీ (అష్ఘల్) సాల్వా రోడ్‌లో కొంత భాగంలో ఒక దిశలో తాత్కాలిక రహదారిని మూసివేయనుంది. దోహాకు వెళ్లే లేన్‌ల కోసం మెకైన్స్ వోకోడ్ పెట్రోల్ స్టేషన్ సమీపంలో మూసివేత ఆంక్షలు జూన్ 28 అర్ధరాత్రి 12 నుండి జూలై 1 అర్ధరాత్రి 12 గంటల వరకు అమల్లో ఉంటాయి. రహదారి నిర్వహణ, మరమ్మత్తు పనులు చేపట్టనున్నట్లు అధికార యంత్రాంగం తెలిపింది. వాహనదారులు తమ గమ్యస్థానాలకు చేరుకోవడానికి పక్కనే ఉన్న ప్రత్యామ్నాయ రహదారులను ఉపయోగించాలని సూచించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com