యూఏఈలో యాంటీ పైరసీ ల్యాబ్‌ ఏర్పాటు..!

- June 28, 2024 , by Maagulf
యూఏఈలో యాంటీ పైరసీ ల్యాబ్‌ ఏర్పాటు..!

యూఏఈ: మేధో సంపత్తి హక్కులు మరియు కంటెంట్ చట్టాలు ఉల్లంఘించే వెబ్‌సైట్‌లను గుర్తించడానికి మరియు బ్లాక్ చేయడానికి దుబాయ్ మీడియా సిటీలో ల్యాబ్‌ను యూఏఈ ఏర్పాటు చేస్తుంది. డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లలో ఆడియో మరియు విజువల్ కంటెంట్ చట్టవిరుద్ధ వినియోగాన్ని గుర్తించడానికి యూఏఈ ఆర్థిక మంత్రిత్వ శాఖ, స్పానిష్ నేషనల్ ప్రొఫెషనల్ ఫుట్‌బాల్ లీగ్ 'లా లిగా' మధ్య అవగాహన ఒప్పందం (MOU) కుదిరింది. టెలికమ్యూనికేషన్స్ రెగ్యులేటరీ అథారిటీ మరియు డిజిటల్ గవర్నమెంట్ (TDRA) సహకారంతో ఈ ప్రాజెక్ట్ అమలు చేయనున్నారు.

చట్టవిరుద్ధంగా ఉపయోగించిన ఆడియోవిజువల్ కంటెంట్‌ను గుర్తించడానికి, విశ్లేషించడానికి ల్యాబ్ లో అత్యాధునిక సాంకేతిక మరియు డిజిటల్ సాధనాలను ఉపయోగిస్తుంది. యూఏఈ మేధో సంపత్తి ఉల్లంఘనలపై తీవ్రంగా పోరాడుతోంది. 'InstaBlock' చొరవ ద్వారా రమదాన్ 2023లో 62 సైట్‌లను, 2024లో డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లలో సృజనాత్మక కంటెంట్  కాపీరైట్‌ను ఉల్లంఘించిన 1,117 వెబ్‌సైట్‌లను ఆర్థిక మంత్రిత్వ శాఖ బ్లాక్ చేసింది. ఆర్థిక మంత్రిత్వ శాఖ అండర్ సెక్రటరీ అబ్దుల్లా బిన్ అహ్మద్ అల్ సలేహ్ మాట్లాడుతూ.. యూఏఈ ప్రాంతీయ మరియు అంతర్జాతీయ స్థాయిలలో అత్యంత అనుకూలత, పోటీతత్వం గల శాసన ఫ్రేమ్‌వర్క్‌ను ఏర్పాటు చేసిందని తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com