ఒమన్‌లో దొరికిన అరుదైన ఉల్క..!
- June 28, 2024![1 ఒమన్‌లో దొరికిన అరుదైన ఉల్క..!](https://www.maagulf.com/godata/articles/202406/eee_1719576004.jpg)
మస్కట్: ఒమన్ సుల్తానేట్ హెరిటేజ్ అండ్ టూరిజం మంత్రిత్వ శాఖ 59.5 గ్రాములు బరువున్న అత్యంత అరుదైన ఉల్కను కనుగొంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇతర చంద్ర ఉల్కలతో పోలిస్తే, 2020 ఫిబ్రవరి 5న గుర్తించిన ఈ ఉల్క అరుదైనదని శాస్త్రీయ అధ్యయనం ధృవీకరించింది. ఇది చంద్రునికి అత్యంత సుదూర భాగానికి చెందినదని తేల్చారు. భూమిపై కనుగొనబడిన చాలా చంద్ర ఉల్కలు చంద్రుడికి దగ్గరగా ఉన్న భాగానికి చెందినవి అయితే, ఈ నమూనా చంద్రుడికి దగ్గరగా ఉన్న భాగం నుండి నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ (NASA) తీసుకువచ్చిన నమూనాల నుండి భిన్నంగా ఉందని నిర్ధారించారు.
నమూనా రసాయన విశ్లేషణ ప్రకారం.. ఈ ఉల్కలో ఉన్న ప్రధాన ఖనిజాలను ప్లాజియోగ్లాస్ (70%), పైరోక్సేన్ (20%), ఆలివిన్ (5%), మరియు ఇనుము, ట్రోలైట్ మరియు మాంగనైట్ వంటి తక్కువ శాతాలలో ఇతర ఖనిజాలు ఉన్నాయని తేల్చారు.
సుల్తానేట్ ఆఫ్ ఒమన్‌లోని ఉల్కలను డాక్యుమెంట్ చేసే చేసేందుకు 2001 నుండి స్విట్జర్లాండ్‌లోని బెర్న్లోని నేచురల్ హిస్టరీ మ్యూజియం సహకారంతో పనిచేస్తున్నారు. ఈ సమయంలో 7,000 కిలోగ్రాముల కంటే ఎక్కువ బరువున్న 7,341 కంటే ఎక్కువ ఉల్క నమూనాలను గుర్తించి డాక్యుమెంట్ చేశారు.
తాజా వార్తలు
- నీజెన్ డయాగ్నోస్టిక్స్ ప్రారంభం
- వాట్సాప్‌లో ఇంట్రెస్టింగ్ ఫీచర్..
- హైదరాబాద్‌లోని పబ్‌లలో పోలీసుల ఆకస్మిక తనిఖీలు
- టీటీడీ ఈవో శ్యామలరావు కీలక నిర్ణయం
- ప్రాంతీయ భద్రతకు బహ్రెయిన్, సౌదీ చర్యలు..!
- ఏడాది పొడవునా ఫ్రీ మెడికల్ చికిత్సలు
- 2023లో అర్థిక వృద్ధిలో ఒమన్ దూకుడు
- ఉద్యోగులపై వేధింపులు.. 6నెలల జైలుశిక్ష, Dh5,000జరిమానా
- కువైట్ లో ఆరవ తరం కెమెరా సిస్టమ్ ప్రారంభం
- లెబనాన్ విడిచి వెళ్లాలి.. సౌదీ పౌరులకు అలెర్ట్