శ్రీలీల ‘న్యూడ్’ ప్రచారం.!
- June 28, 2024అదేంటీ.! శ్రీలీల ఏంటీ.! న్యూడ్ ప్రచారమేంటీ.? అనుకుంటున్నారా.? ఆగండాగండి. న్యూడ్ అనేది ఓ వాణిజ్య ప్రచారాల కంపెనీ. ఒక రకమైన చర్మ సంబంధిత క్రీమ్‌కి సంబంధించిన యాడ్‌లో శ్రీలీలను బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంచుకున్నారట.
ఈ బ్రాండ్ స్కిన్ క్రీమ్‌ని ప్రచారం చేయడంలో ప్రస్తుతం శ్రీలీల బిజీగా వుందంటున్నారు. అదేనండీ ఈ యాడ్ షూట్లో శ్రీలీల నటిస్తోందట. ‘ధమాకా’ సినిమాతో స్టార్ హీరోయిన్ హోదాని చాలా తక్కువ టైమ్‌లోనే దక్కించేసుకుంది శ్రీలీల.
అయితే, అంతే వేగంగా ఐరెన్ లెగ్ ముద్ర కూడా వేయించేసుకుంది. దాంతో, దక్కించుకున్న స్టార్డమ్ డైలమాలో పడిపోయింది. ఒప్పుకున్న ప్రాజెక్టులే కొన్ని వెనక్కి వెళ్లిపోయాయ్ కూడా.
ప్రస్తుతం శ్రీలీల చేతిలో పక్కాగా అంటే ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మాత్రమే వుంది. కానీ, ఈ సినిమా ఇప్పట్లో పూర్తయ్యేది కాదు. విజయ్ దేవరకొండ తదితర హీరోలతో నటించాల్సి వున్నప్పటికీ ఆయా ప్రాజెక్టుల్ని కొత్త భామ భాగ్యశ్రీ బోర్సే ఎత్తుకుపోయిందన్న టాక్ వుంది.
సో, సినిమాల సంగతెలా వున్నా.. దీపమున్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలనుకుందో ఏమో, కమర్షియల్ యాడ్స్‌పై ఎక్కువగా సైన్ చేస్తోందట. ఇప్పటికే శ్రీలీల పలు కమర్షియల్ యాడ్స్‌లో నటించిన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- 115,000 దిర్హామ్‌లు చోరీ..మాజీ ఉద్యోగికి జైలుశిక్ష, జరిమానా
- దుబాయ్‌లో ప్రత్యేక డ్రైవింగ్ అనుమతి..5 అర్హతలు, ఫీజు
- ఇరాన్ అధ్యక్షుడికి కింగ్ సల్మాన్, క్రౌన్ ప్రిన్స్ శుభాకాంక్షలు
- ఒమన్ లో ఉపాధి, వాణిజ్యం, పెట్టుబడికి..ప్రమోషన్ ఈవెంట్
- యూఏఈలో జూలై 8 నుండి 10 ఏళ్ల పాస్‌పోర్ట్‌ల జారీ
- అపార్ట్మెంట్ అగ్నిప్రమాదం.. ఇద్దరు ప్రవాసులు మృతి
- సూరత్ లో కుప్పకూలిన అపార్ట్మెంట్–ఏడుగురు దుర్మరణం
- ఆషాఢమాస బోనాల ఉత్సవాలు షురూ..
- $32 మిలియన్ల విలువైన రాకెట్ బస్ట్..25 మంది అరెస్ట్
- మాబ్ ఫైట్..పలువురు అరెస్ట్