‘కల్కి’ని నార్త్ ఇండియన్సే మోయాలి.!
- June 28, 2024రాముడు, కృష్ణుడి కాన్సెప్ట్‌తో రూపొందుతోన్న సినిమాలకు నార్త్ ఇండియన్లు పట్టం కడుతున్నారు. కాస్టింగ్‌తో సంబంధం లేకుండా బ్రహ్మరధం పట్టేస్తున్నారు. అలాగే ‘కార్తికేయ 2’ సినిమా నార్త్‌లో సంచలనాలు సృస్టించింది.
ఏమాత్రం కంటెంట్ బాగుందన్న టాక్ వచ్చినా బాలీవుడ్ జనం బాగా ఆదరిస్తున్నారు ఆయా సినిమాల్ని. ఇక, ఇప్పుడు ‘కల్కి’ వంతొచ్చింది. ఈ సినిమాని తెలుగులో కన్నా హిందీలోనే ఎక్కువగా ప్రమోట్ చేశారు కూడా.
ఇక, రిలీజ్ తర్వాత టాక్ కూడా బాగానే వుంది. కృష్ణుడి ప్రస్థావనతో పాటూ, మహాభారతం.. ఆయా పాత్రల ప్రస్థావన ఎక్కువగా ఈ సినిమాలో చూపించారు. కీలక పాత్రధారుడిగా అమితాబ్ బచ్చన్ కనిపిస్తుండడంతో ఈ సినిమా బాలీవుడ్లో రికార్డులు కొల్లగొట్టేయడం ఖాయమంటున్నారు ట్రేడ్ పండితులు.
ఇంతవరకూ ప్రబాస్ చేసిన సినిమాల్లోకెల్లా ‘కల్కి 2898ఏడీ’కి వచ్చిన పాజిటివ్ టాక్ మెచ్చుకోదగ్గది. సో, ఈ సినిమాని తెలుగు రాష్ట్రాల ప్రజల సంగతెలా వున్నా.. బాలీవుడ్ జనం మాత్రం నెత్తిన పెట్టుకుని మోస్తారన్న టాక్ వినిపిస్తుంది.
తాజా వార్తలు
- ఖతార్ ఎయిర్వేస్ హాలిడేస్..లెజెండ్స్ మ్యాచ్ కోసం స్పెషల్ ప్యాకేజీలు..!!
- తుబ్లీ కారు దొంగతనం..మహిళా జైలుశిక్ష రద్దు..!!
- ఖైతాన్‌లో ట్రాఫిక్ క్యాంపెయిన్.. 51 మంది అరెస్టు..!!
- అల్ దఖిలియాలో ఒంటె రేసులు ప్రారంభం..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ గైడ్.. టిక్కెట్లు, ప్రత్యేకతలు..!!
- ముహైస్నా బ్రిడ్జి సమీపంలో ప్రమాదం..వాహనం బోల్తా..!!
- సుప్రీంకోర్టులో సీఎం చంద్రబాబుకు ఎదురుదెబ్బ..
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన సౌదీ నుంచి స్వదేశానికి చేరిన నిర్మల్ జిల్లావాసి
- లాస్ ఏంజిల్స్ నూతన కార్యవర్గ సమావేశంలో నిర్ణయాలు
- మహిళా టీ20 ప్రపంచకప్..భారత్ పై న్యూజిలాండ్ విజయం