రక్తదానం చేయడం ఆరోగ్యానికి మంచిదా.? కాదా.?

- July 01, 2024 , by Maagulf
రక్తదానం చేయడం ఆరోగ్యానికి మంచిదా.? కాదా.?

రక్తదానం చేస్తే ప్రాణదానం చేసినట్లే. ఒక్క ప్రాణం కాదు, ఏకంగా మూడు ప్రాణాలు కాపాడినట్లు. అవునండీ ఒక్కసారి చేసిన రక్తదానంతో ముగ్గురి ప్రాణాలు కాపాడొచ్చని (అవతలి వ్యక్తి ప్రమాద తీవ్రతను బట్టి) నిపుణులు చెబుతున్నారు.

కానీ, చాలా మంది రక్తదానం చేయడానికి భయపడుతుంటారు. రక్తదానం చేస్తే తాము రక్తాన్ని కోల్పోతామనీ తద్వారా నీరసం ఆవహిస్తుందనీ, రకరకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని భయపడుతుంటారు.

కానీ, రక్తదానం చేయడం వెనక ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయని చెపుతున్నారు. ముఖ్యంగా గుండె సంబంధిత వ్యాధులు, ఆకస్మిక గుండె నొప్పులు వచ్చే ప్రమాదం వుండదట.

అలాగే, కొలెస్ట్రాల్ సమస్యలు కూడా తీరుతాయ్. శరీరంలో కాలరీలు ఖర్చవుతాయ్. తద్వారా అనవసరమైన బరువు సమస్యల నుంచి ఉపశమనం పొందొచ్చు. శరీరంలో ఐరన్ సమతుల్యతలు పెరుగుతాయ్. రక్తపోటు నియంత్రణలో వుంటుంది.

కొత్త కణాల వృద్ధి జరుగుతుంది. దాంతో క్యాన్సర్ ముప్పు వుండదని నిపుణులు చెబుతున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com