యూఏఈలో డ్రైవింగ్ స్కూల్స్ కొత్త దందా?
- July 02, 2024యూఏఈ: యూఏఈ నివాసి మహా ఎల్ తన డ్రైవింగ్ పరీక్షలో వరుసగా తొమ్మిది సార్లు ఫెయిలయ్యారు. ఎమిరేట్‌లోని వేరే డ్రైవింగ్ స్కూల్‌కు మారారు. అక్కడ ఆమె మొదటి ప్రయత్నంలోనే ఉత్తీర్ణత సాధించింది. "నేను ప్రతిదీ సరిగ్గా చేసినప్పటికీ, మొదటి పాఠశాలలో నన్ను ఉద్దేశపూర్వకంగా ఫెయిల్ చేస్తున్నట్లు అనిపించింది. నేను అక్కడ తొమ్మిది సార్లు ఎలా విఫలమయ్యానో నాకు అర్థం కాలేదు. కానీ నా మొదటి ప్రయత్నంలోనే మరొక డ్రైవింగ్ స్కూళ్లో చాలా సులభంగా ఉత్తీర్ణత సాధించాను." ఆమె చెప్పింది. కొన్ని డ్రైవింగ్ పాఠశాలలు ఉద్దేశపూర్వకంగా విద్యార్థుల నుండి ఎక్కువ డబ్బును సేకరించేందుకు ఇలా తమ స్టూడెంట్స్ ను ఉద్దేపూర్వకంగా ఫెయిల్ చేస్తున్నట్లు సోషల్ మీడియాలో పుకార్లు హల్చల్ చేస్తున్నాయి. ఈ ప్రక్రియతో విసుగు చెందిన కొందరు విద్యార్థులు తమ ఆందోళనలను వినిపించి పాఠశాలలు మారారు. కానీ డ్రైవింగ్ స్కూల్స్ మాత్రం వీటిని ఖండిస్తున్నారు.
దుబాయ్‌కి చెందిన లెబనీస్ ప్రవాస బిలాల్ యాసిర్ తన పరీక్షలో ఆరుసార్లు ఫెయిల్ అయ్యాడు. దీని తర్వాత, అతను తన డ్రైవింగ్ ఇన్‌స్టిట్యూట్‌ని మార్చుకోవాలని నిర్ణయించుకున్నాడు. "కొన్ని డ్రైవింగ్ పాఠశాలలు ఎగ్జామినర్లతో మెరుగైన సంబంధాలను కలిగి ఉన్నాయని, ఫలితాలను ప్రభావితం చేయగలవని నేను భావిస్తున్నాను. అయితే ఇతరులు వారి విద్యార్థులపై కఠినంగా ఉంటారు." అని యాసర్ తెలిపారు. కేవలం 10 నిమిషాలు మాత్రమే జరిగే స్ట్రీట్ ఎగ్జామ్‌లో ఎవరైనా సురక్షితమైన, సమర్థుడైన డ్రైవర్ కాదా అనేది ఖచ్చితంగా నిర్ధారించడం లేదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. డ్రైవింగ్ లైసెన్స్ పొందడం అనేది ఒక వ్యక్తి నైపుణ్యాలపై కాకుండా డ్రైవింగ్ పాఠశాలల ఇష్టాలపై ఆధారపడి ఉంటుందని పలువురు స్టూడెంట్స్ తమ సోషల్ మీడియా అకౌంట్లలో వాపోయారు. కాగా, డ్రైవింగ్ పాఠశాలలు ఆర్థిక ప్రయోజనాల కోసం లెర్నింగ్ ప్రక్రియను పొడిగిస్తాయనే అభిప్రాయం ఒక అపోహ అని గలదరి మోటార్ డ్రైవింగ్ సెంటర్లో మార్కెటింగ్ హెడ్ సమీర్ అఘా కొట్టిపారేశారు. అయితే, యూఏఈలో డ్రైవింగ్ లైసెన్స్ పొందడానికి, పౌరులు మరియు ప్రవాసులు తప్పనిసరిగా ఎమిరేట్స్‌లో ఒక రిజిస్టర్డ్ డ్రైవింగ్ ఇన్స్టిట్యూట్కి దరఖాస్తు చేసుకోవాలి. ముందస్తు డ్రైవింగ్ అనుభవం లేని వ్యక్తులు తప్పనిసరిగా ఇన్స్టిట్యూట్ అందించిన 40 గంటల డ్రైవింగ్ కోర్సులను పూర్తి చేయాలి. డ్రైవింగ్ సంస్థలలో విద్యార్థులు యూఏఈ ట్రాఫిక్ విభాగం సెట్ చేసే వివిధ పరీక్షలలో ఉత్తీర్ణత సాధించాలి.
తాజా వార్తలు
- సూరత్ లో కుప్పకూలిన అపార్ట్మెంట్–ఏడుగురు దుర్మరణం
- ఆషాఢమాస బోనాల ఉత్సవాలు షురూ..
- $32 మిలియన్ల విలువైన రాకెట్ బస్ట్..25 మంది అరెస్ట్
- మాబ్ ఫైట్..పలువురు అరెస్ట్
- కువైట్ లో డొమెస్టిక్ వీసా..వర్క్ వీసాకు బదిలీ
- డ్రైవ్ సందర్భంగా గొడవ..స్నేహితుడి పై దాడి..!
- ఇజ్రాయెల్ చర్యలను ఖండించండి.. యూరప్‌ను కోరిన సౌదీ
- షార్జాలో ఉచిత పార్కింగ్
- హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లో చంద్రబాబు, రేవంత్ రెడ్డి భేటీ
- ముహారం.. హుసైనియాకు కీలక సూచనలు జారీ