రేపు బ్రిటన్‌లో ఎన్నికలు.. ఎన్నికల పోల్స్ రిషి సునక్ గురించి ఏమంటున్నాయంటే..

- July 03, 2024 , by Maagulf
రేపు బ్రిటన్‌లో ఎన్నికలు.. ఎన్నికల పోల్స్ రిషి సునక్ గురించి ఏమంటున్నాయంటే..

బ్రిటన్ ప్రజలు తమ ప్రధానిని ఎన్నుకునే తరుణం ఎట్టకేలకు ఆసన్నమైంది. రేపు అంటే జూలై 4న బ్రిటన్‌లో ఓటింగ్ జరగనుంది. ఈ ఎన్నికల్లో కన్జర్వేటివ్ పార్టీ నుంచి రిషి సునక్, లేబర్ పార్టీ నుంచి కైర్ స్టార్మర్ మధ్య గట్టి పోటీ నెలకొంది.

ఇప్పటివరకు వచ్చిన అన్ని ఒపీనియన్ పోల్స్‌లో కైర్ స్టార్మర్స్ లేబర్ పార్టీ ఆధిక్యంలో ఉంది. సర్వే ప్రకారం రిషి సునక్ ఘోరమైన ఓటమిని ఎదుర్కోవలసి ఉంటుందని పేర్కొన్నాయి. అయితే, కైర్ స్టార్మర్ బ్రిటన్ తదుపరి ప్రధాన మంత్రి అయ్యే అవకాశాలున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే రేపు ప్రధాని ఎవరు అనేది ఓటర్లు నిర్ణయిస్తారు. ప్రస్తుతం ఇద్దరు నాయకుల్లో ఎవరు అత్యంత ధనవంతుడనే ప్రశ్న అందరి మదిలో మెదలుతుంది.

రిషి సునక్ అత్యంత ధనవంతుడు
బ్రిటన్ ఆఫీస్ ఫర్ నేషనల్ స్టాటిస్టిక్స్ (ONS) ప్రకారం.. లేబర్ పార్టీకి చెందిన కైర్ స్టార్మర్ కంటే కన్జర్వేటివ్ పార్టీకి చెందిన రిషి సునక్ ధనవంతుడు. రిషి సునక్, అతని భార్య అక్షతా మూర్తి నికర విలువ దాదాపు 651 మిలియన్ ఫౌండ్లు. దీనికి కారణం ఇన్ఫోసిస్ షేర్లు. ఇన్ఫోసిస్‌లో అక్షతా మూర్తికి గణనీయమైన వాటా ఉంది. గత ఏడాది కాలంలో ఇన్ఫోసిస్ షేర్లలో మంచి పెరుగుదల ఉంది. మేలో విడుదల చేసిన సండే టైమ్స్ రిచ్ లిస్ట్ రిపోర్ట్ ప్రకారం.. అక్షిత, రిషి సునక్ సంపద బ్రిటన్ రాజు చార్లెస్ కంటే ఎక్కువ. ఈ సంవత్సరం వారి సంపద 120 మిలియన్ పౌండ్లు పెరిగింది. 2023లో 529 మిలియన్ పౌండ్ల నుండి 651 మిలియన్ పౌండ్‌లకు పెరిగింది.

కైర్ స్టార్మర్ దగ్గర అంత డబ్బు లేదు
లేబర్ పార్టీ నాయకుడు కైర్ స్టార్మర్ నికర విలువ దాదాపు 7.7 మిలియన్ పౌండ్లు. అతని సంపదలో ఎక్కువ భాగం అతని న్యాయవాద వృత్తి , రాజకీయ నాయకుడిగా సంపాదన నుండి వస్తుంది. అతను సర్రేలో సుమారు 10 మిలియన్ పౌండ్ల విలువైన భూమిని కలిగి ఉన్నాడు. అతను న్యాయవాదిగా ఉన్న సమయంలో 1996లో కొనుగోలు చేశాడు.

మొత్తం 650 స్థానాలకు పోలింగ్
బ్రిటన్‌లోని మొత్తం 650 స్థానాలకు జూలై 4న పోలింగ్ జరగనుంది. ప్రధానమంత్రి కావాలంటే 326స్థానాలను దక్కించుకోవాలి. అప్పుడే ఎక్కువ సీట్లు వచ్చిన పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. ఇక్కడ చాలా దశాబ్దాలుగా కన్జర్వేటివ్ పార్టీ , లేబర్ పార్టీ మధ్య పోటీ ఉంది. ఇక్కడ ఓట్లు బ్యాలెట్ బాక్స్‌లో వేయబడతాయి. ఈ ఏడాది బ్రిటన్‌లో 5 కోట్ల మంది ఓటర్లు పాల్గొంటారు. ఎన్నికల పోలింగ్ ఉదయం 7 గంటలకు ప్రారంభమై రాత్రి 11 గంటల వరకు కొనసాగుతుంది.

ఆధిక్యంలో లేబర్ పార్టీ నేత కైర్ స్టార్మర్
ఇప్పటి వరకు జరిగిన సర్వేల్లో లేబర్ పార్టీకి భారీ ఆధిక్యం లభించింది. అనేక ఒపీనియన్ పోల్స్‌లో లేబర్ పార్టీ ముందుంది. మార్చి పోల్‌లో రిషి సునక్‌కు 38 రేటింగ్ ఇవ్వబడింది. ఇది చెత్త రేటింగ్. ఏప్రిల్‌లో యూగోవ్ పోల్ కన్జర్వేటివ్ పార్టీకి 155 సీట్లు మాత్రమే వస్తాయని తేలింది. అయితే 2019లో మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ నాయకత్వంలో ఆ పార్టీ 365 సీట్లు గెలుచుకుంది. ఈసారి లేబర్ పార్టీకి 403 సీట్లు వస్తాయని పేర్కొంది. 18 వేల మందిపై నిర్వహించిన ఒపీనియన్ పోల్స్ లో రిషి సునక్ పార్టీ ఘోర పరాజయాన్ని చవిచూడవచ్చని తేలింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com