తెలుగు రాష్ట్రాలకు వచ్చేస్తున్న వందేభారత్ స్లీపర్ రైళ్లు

- July 03, 2024 , by Maagulf
తెలుగు రాష్ట్రాలకు వచ్చేస్తున్న వందేభారత్ స్లీపర్ రైళ్లు

తెలుగు రాష్ట్రాలకు రైల్కే నుంచి కీలక అప్డేట్ అందుతోంది. వందేభారత్ రైళ్లకు తెలుగు రాష్ట్రాల్లో ఆదరణ పెరుగుతోంది. ఈ క్రమంలో రైల్వే కొత్తగా ప్రవేశ పెడుతున్న వందేభారత్ స్లీపర్ రైళ్లల్లోనూ తెలుగు రాష్ట్రాలకు ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణక్ష్ించారు.

ఆగస్టు 15 నాటికి ముందుగా మూడు వందేభారత్ రైళ్లను ప్రారంభించనున్నారు. అందులో ఒక రైలు తెలుగు రాష్ట్రాలకు కేటాయించారు. దశల వారీగా మరో రెండు రైళ్ల కేటాయింపు పైన ప్రతిపాదనలు సిద్దమయ్యాయి.

వందేభారత్ స్లీపర్ ప్రారంభం
మరి కొద్ది రోజుల్లోనే వందేభారత్ స్లీపర్ ట్రైన్ అందుబాటులోకి రానుంది. తొలి వందే భారత్ స్లీపర్ రైలు పట్టాలెక్కేందుకు రెడీ అవుతున్నది. దేశంలోనే మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్ రైలును ఢిల్లీ, ముంబయి మార్గంలో నడపాలని భావిస్తున్నారు. తొలి విడతలో మూడు వందేభారత్ స్లీపర్ రైళ్లను ప్రారంభించాలని నిర్ణయించారు. అందులో ఒక రైలు సికింద్రాబాద్ - పూణే మధ్య ప్రారంభించేందుకు రైల్వే బోర్డు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మార్గంలో ఇప్పటికే నడుస్తున్న పలు రైళ్లకు డిమాండ్ ఎక్కువగా ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో ఇలా
తొలుత ఈ మార్గంలో వందేభారత్ నడపాలని భావించినా..దూరం ప్రయాణం కావటంతో వందేభారత్ స్లీపర్ సేవలు ప్రారంభం కాగానే ప్రాధాన్యత ఇస్తామని గతంలో రైల్వే మంత్రి హామీ ఇచ్చారు. ఇప్పుడు వందేభారత్ స్లీపర్ తొలి మూడు రైళ్లల్లో ఒక రైలు ఈ మార్గంలో ప్రారంభం కానుంది. అదే విధంగా కాచిగూడ - తిరుపతి, కాచిగూడ - విశాఖపట్నం మార్గాల్లోనూ వందేభారత్ స్లీపర్ రైళ్లు కేటాయించే అవకాశం కనిపిస్తోంది. రెండో విడతలో ఈ రైలు వస్తుందని అధికారులు చెబుతున్నారు. ఈ కొత్త స్లీపర్ వందే భారత్ స్లీపర్లను పదహారు బోగీలతో ఏసీ.. నాన్ ఏసీ కోచ్ లతో నడపనున్నారు.

అధికారుల కసరత్తు
వందేభారత్ ఛైర్ కార్ లో టికెట్ల ధరలు ఎక్కువగా ఉండటంతో ఈ రైళ్లల్లో కొత్త నిర్ణయం తీసుకున్నారు. వందే భారత్ స్లీపర్ లో మొత్తం 16 కోచ్ లు ఉండనుండగా వాటిల్లో థర్డ్ ఏసీ 10, సెకండ్ ఏసీ 4, ఫస్ట్ ఏసీ ఒక బోగీ ఉంటాయని రైల్వే వర్గాలు పేర్కొన్నాయి. సీటింగ్‌తో పాటు లగేజీ కోసం రెండు బోగీలు అదనంగా ఉంటాయి. టికెట్ ధరల్లోనూ కొంత వెసులుబాటు ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. ఆగస్టు 15న తెలుగు రాష్ట్రాల నుంచి ముందుగా ఒక వందేభారత్ స్లీపర్ రైలు సేవలు ఆరంభం కావటం ఖాయంగా కనిపిస్తోంది. దీని పైన త్వరలోనే అధికారికంగా ప్రకటన రానుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com