తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల్లో కీలక పరిణామం..

- July 03, 2024 , by Maagulf
తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల్లో కీలక పరిణామం..

హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. కేబినెట్ విస్తరణతో పాటు కొత్త పీసీసీ అధ్యక్ష నియామకం తాత్కాలికంగా వాయిదా వేసినట్లు సమాచారం. నేతల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడం, మంత్రివర్గంలో చోటు కల్పించే ఆశావహుల సంఖ్య ఎక్కువగా ఉండటం కారణంగా కేబినెట్ విస్తరణ, పీసీనీ నియామకం తాత్కాలికంగా వాయిదా వేసినట్లు తెలుస్తోంది. వారం పది రోజుల తర్వాత మరోసారి దీనిపై చర్చించాలని నిర్ణయం తీసుకున్నట్టు ఏఐసీసీ వర్గాలు పేర్కొన్నాయి.

తెలంగాణ పీసీసీ నియామకంలో బీసీలకు అవకాశం కల్పించాలని అభిప్రాయానికి వచ్చిన ఎవరికి ఇవ్వాలో నిర్ణయించడానికి కొంత సమయం పడుతుందని ఆ పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో రెండింటిపై నిర్ణయం తీసుకోవడం కన్నా కొంత సమయం వరకు వేచి ఉండి ఆ తరువాతే చర్చిస్తే మంచిదని కాంగ్రెస్ అగ్రనేతలు కొందరు అభిప్రాయపడినట్లు తెలుస్తోంది.

ఈ క్రమంలోనే మల్లికార్జున ఖర్గే కర్ణాటక వెళ్లిపోగా, కేసీ వేణుగోపాల్ కేరళ వెళ్లిపోయినట్టు సమాచారం. పీసీసీ అధ్యక్షుడు నియామకంతోపాటు కేబినెట్ విస్తరణపై కసరత్తు కొలిక్కిరాలేదని సమావేశానికి హాజరైన కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీల సమక్షంలో జరిగిన కీలక భేటీలోనూ ఏకాభిప్రాయం రాలేదని నేతలు అంటున్నారు. ఈ విషయంలో ఇప్పటికే నేతల అభిప్రాయాలను పార్టీ అధిష్టానం అడిగి తెలిసుకున్నట్టు తెలుస్తోంది. మరోమారు పార్టీ నేతలతో చర్చల ప్రక్రియ ప్రారంభించాలనే యోచనలో కాంగ్రెస్ అధిష్టానం ఉన్నట్లు సమాచారం.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com