ఇసుకను బ్లాక్ లో అమ్మితే బొమ్మ చూపిస్తాం...స్ట్రాంగ్ వార్ణింగ్ ఇచ్చిన మంత్రి కొల్లు రవీంద్ర

- July 04, 2024 , by Maagulf
ఇసుకను బ్లాక్ లో అమ్మితే బొమ్మ చూపిస్తాం...స్ట్రాంగ్ వార్ణింగ్ ఇచ్చిన మంత్రి కొల్లు రవీంద్ర

ఆంధ్రప్రదేశ్ లో ఇంతకాలం ఇసుక దందాతో ప్రజలను దోచుకున్న వారి నుంచి మొత్తం కక్కిస్తామని గనుల శాఖా మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. గత ఐదు సంవత్సరాలలో వైసీపీ నాయకులు సామాన్య ప్రజల నుంచి ఇసుక దోపిడీ చేశారని, ఇక ముందు ప్రజలకు ఇసుక ఉచితంగా అందిస్తామని, అతి త్వరలో విధివినాదాలు తయారు చేస్తామని మంత్రి కొల్లు రవీంద్ర చెప్పారు.

అమరావతిలో బుధవారం మీడియాతో మాట్లాడిన మంత్రి కొల్లు రవీంద్ర గత వైసీపీ ప్రభుత్వంపై, వైసీపీ నాయకులపై విరుచుకుపడ్డారు. ఐదు సంవత్సరాల పాలనలో వైసీపీ నాయకులు కేవలం ఇసుకను అడ్డం పెట్టుకుని వేలాది కోట్ల రూపాయాలను లూటీ చేశారని, ఇసుకను అడ్డం పెట్టుకుని సామాన్య ప్రజలను దోచుకున్నారని గనుల శాఖా మంత్రి కొల్లు రవీంద్ర ఆరోపించారు.

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత సుమారు తొమ్మిది నెలల పాటు ఇసుక ఎవ్వరికి అందకుండా డిమాండ్ పెరిగేలా చేశారని, తరువాత ఒక్కో టన్నుకు వేలాది రూపాయలు వసూలు చేసి ఇసుకను విక్రయించారని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇసుకను అడ్డం పెట్టుకుని నిధులు దోచుకోవడానికి జేపీ సంస్థను తెరమీదకు తెచ్చిన వైసీపీ నాయకులు ప్రభుత్వ సొమ్మును లూటీ చేశారని గనుల శాఖా మంత్రి కొల్లు రవీంద్ర ఆరోపించారు.

ఇసుక మీద సుమారు 40 రంగాల వాళ్లు ఆధారపడ్డారని, ఈ విషయం తెలుసుకున్న వైసీపీ నాయకులు గత ఐదు సంవత్సరాల్లో వేల కోట్ల రూపాయాలు సంపాధించుకున్నారని, ఆ రంగాలకు చెందిన వారి జీవితాలతో చెలగాటం ఆడారని మంత్రి ఆరోపించారు. అసెంబ్లీ ఎన్నికల ముందు ఆంధ్రప్రదఏశ్ ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం సీఎం చంద్రబాబు నాయుడు ఉచిత ఇసుక పంపిణికి అనుమతి ఇవ్వడం చాలా సంతోషంగా ఉందని, ఆంధ్రప్రదేశ్ ప్రజలు హ్యాపీగా ఉన్నారని రవీంద్ర అన్నారు.

2014-2019 మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్ లో ఉచిత ఇసుక స్కీమ్ ప్రవేశ పెట్టింది తెలుగుదేశం ప్రభుత్వమే అని, ఆ తరువాత అధికారంలోకి వచ్చిన వైసీపీ నాయకులు మాత్రం ఉచిత ఇసుకను ఎత్తేసి వాళ్ల జోబులు నింపుకోవడానికి భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేసి ఇసుకను అమ్మేశారని ఆరోపించారు.

ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉచితంగా ఇసుక అందిస్తామని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. ఉచిత ఇసుకను ఎవరైనా బ్లాక్ మార్కెట్ లో విక్రయించడానికి ప్రయత్నిస్తే వారి మీద కఠిన చర్యలు తీసుకుని జైలుకు పంపిస్తామని ఆంధ్రప్రదేశ్ గనుల శాఖా మంత్రి కొల్లు రవీంద్ర హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి వస్తే ఉచిత ఇసుక అందిస్తామని ఎన్నికలకు ముందు చంద్రబాబు హామీ ఇచ్చిన విషయం తెలిసిందే.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com