23 ఏళ్ల వ్యక్తికి 30,000 దిర్హామ్‌ల జరిమానా

- July 05, 2024 , by Maagulf
23 ఏళ్ల వ్యక్తికి 30,000 దిర్హామ్‌ల జరిమానా

దుబాయ్: మాదకద్రవ్యాల వినియోగానికి పాల్పడిన అరబ్ వ్యక్తికి 30,000 దిర్హామ్ జరిమానా విధించారు.  రెండేళ్లపాటు ఇతరులకు లేదా ఇతరుల ద్వారా డబ్బును బదిలీ చేయడం లేదా డిపాజిట్ చేయకుండా ఆంక్షలు విధించారు. మాదకద్రవ్యాల వినియోగం మరియు నగదు బదిలీకి సంబంధించిన చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడినందుకు 23 ఏళ్ల వ్యక్తికి దుబాయ్ క్రిమినల్ కోర్టు జరిమానా విధించింది. అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ, యూఏఈ సెంట్రల్ బ్యాంక్ అనుమతితో మాత్రమే నిందితులు బ్యాంక్ సేవలను ఉపయోగించుకోవచ్చని న్యాయమూర్తులు స్పష్టం చేశారు.  

జనవరి 16 అల్ బార్షా పోలీస్ స్టేషన్ పరిధిలో  చట్టపరమైన ప్రిస్క్రిప్షన్ లేకుండానే నిందితుడు మెథాంఫేటమిన్ మరియు యాంఫేటమిన్ అనే రెండు సైకోయాక్టివ్ పదార్ధాలను రెండవసారి వినియోగించినట్లు గుర్తించారు. అతను మరొక వ్యక్తికి చెందిన బ్యాంకు ఖాతాకు డబ్బును బదిలీ చేయడం ద్వారా డ్రగ్స్ కోసం చెల్లించాడని కూడా న్యాయవాదులు తెలిపారు. జరిమానా చెల్లించని పక్షంలో  చెల్లించని ప్రతి 100 దిర్హామ్‌లకు ఒక రోజు జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని న్యాయమూర్తులు తెలిపారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com